
Ap Elections 2024:అసలు ఈ ఓటు హక్కు ఎలా వచ్చిందో మీకు తెలుసా? ఓటు హక్కు మనకు రావడానికి ఎంతమంది మహాత్ములు కష్ట పడ్డారో తెలుసుకుందాం.
పూర్వకాలంలో ప్రజలను పరిపాలించడానికి రాజులు ఉండేవారు. ఆ రాజులను సామాన్య ప్రజలు ఎన్నుకునే వారు కాదు.
కేవలం వారు రాజులు అయితే చాలు. ఆ రాజు మరణిస్తే వారి కుమారులు తర్వాత వారి కుమారులు అలా వారి వంశమే పరిపాలిస్తూ ఉండేది.
ఆ రాజు చేసిందే న్యాయం చెప్పిందే సత్యం అన్నట్టు ఉండేది. తరువాత బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించి కొన్ని ఏళ్లు పరిపాలించారు.
బ్రిటిష్ వాళ్లు మన ప్రజలను హింసకు గురిచేసి మనం ఉండే భూమిపై త్రాగే నీటిపై తినే తిండి మొదలైన వాటిపై చివరికి మనపై కూడా శిస్తు విధిస్తూ అజమాషి చేసి మనల్ని బాగా బాధపెట్టేవారు.
ఆ బ్రిటిష్ వాళ్ల నుంచి మన దేశాన్ని మనల్ని కాపాడి మన దేశానికి స్వతంత్రం వచ్చేలాగా చాలామంది మహాత్ములు పోరాడి కొంతమంది మహాత్ములు ప్రాణ త్యాగం చేసి మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళ చేతుల నుంచి మనకు వచ్చే లాగా చేశారు.
తర్వాత మన దేశాన్ని పరిపాలించే వాళ్లను ప్రజలే ఎన్నుకోవాలి అని అంబేద్కర్ వాదించారు.ఈ ప్రతిపాదన వల్ల భారతదేశంలో మొట్టమొదట ఓట్ అనే హక్కు మొదలైంది.25-10-1951 నుంచి 21-10-1952 వరకు స్వతంత్ర భారతదేశంలో అధికార పగ్గాలు ప్రజల సమక్షంలో ప్రజలే నిర్ణయించుకోవాలి.
అనే అంబేద్కర్ వాదనను దేశ నాయకులు అందరూ సమతిస్తూ వారి బలబలాలను ఇంకా ప్రజాభిమానాన్ని కొలిచే భారతదేశ వేదికగా ఎన్నికలు సరిగ్గా సరిపోతాయి.
అని భావించి బరిలోకి దిగారు. అలా మొదటి నిర్వహించిన ఎన్నికల్లో ప్రపంచం మొత్తం విస్తూపోయేలా లోక్ సభ స్థానాలు నుంచి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ 476, 65,875 ఓట్లు సుమారు 45 శాతం గెలిచి చరిత్ర సృష్టించారు.
తన అధ్యక్షత వహించిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్489 సీట్ల గాను364 సీట్లు కైవసం చేసుకున్నాయి. ప్రజాభిమానాన్ని గెలిచారు. దిశ దిశ వ్యాపించి భారతదేశ వైపు చూసే లాగా చేసింది ఓటు హక్కు ద్వారా సమాజం ఎంతలాగా ప్రభావితం అవుతుంది.
అని తెలియ చెప్పగలిగింది. ప్రజాస్వామ్యం ద్వారా ప్రజలకు శక్తివంతమైన హక్కు ఇవ్వబడింది. అదే ఓటు హక్కు ప్రజలు ప్రజల కోసం ,మరియు ప్రజల చేత ,అనే ప్రజాస్వామ్యం నినాదానికి ఓటింగ్ మూల స్తంభం
ఫలితంగా దానిని సెలవుగా చూడకుండా దేశ నిర్మాణ ప్రక్రియ లో మరియు మార్పు ప్రభావమార్పు లో పాల్గొనాలి.
అనుకుంటే తప్పనిసరిగా ఓటు వేయాలి .పౌరుడు ఓటు వేయడానికి కారణం వెతకవలసిన అవసరం లేదు. ఓటు వేయడానికి చట్టపరమైన బాధ్యత లేనప్పటికీ అది తప్పనిసరిగా చేయాలి.
స్వతంత్రం వచ్చినప్పటినుండి భారతదేశంలో ఓటు నమోదు అనేది చాలా కీలకమైనదిగా మారిపోయింది.
వ్యక్తిగత కారణాలు ఇంకా భావోద్వేగాలు పక్కన పెట్టి వ్యవస్థాపక బాగు గురించి ఓటు హక్కును వినియోగించి సరేనా అభ్యర్థికే ఓటు వేయాలి అని 72ఏళ్ల ఎన్నికల చరిత్ర మనకు చెబుతున్న పచ్చి నిజం కానీ ఓటు హక్కు వినియోగించే సగటు భారతీయుడు మదిలో మెదిలే ఎన్నో చిక్కుముడులాగ ప్రశ్నలు .2024వ సంవత్సరంలో కూడా కులాలు ,మతాలు ,వర్గాలు పేరట జనాలను విచ్ఛిన్నం చేసి ఓట్లను చీల్చే ప్రయత్నం చేసే నాయకులు ఉన్నారు.
ఎన్నికలు అంటే మా వర్గం వాళ్ళు ఎన్ని గెలిచారో చెప్పుకునే వారు ఉన్నారు. ఫలానా వ్యక్తి ఆ పదవికి అర్హుడా కాదా మనకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు సక్రమంగా అందిస్తున్నారా లేదా అని ఆలోచించడం మానేసి ఆ అభ్యర్థి మనం కులం వాడా, మన మతం వాడ ,మన వర్గం వాడా, లేదా మన ప్రాంతం వాడ అనే ఆలోచించే దిగజారుడు తత్వంగా ఎన్నికలు తయారు అయ్యాయి.
ఇంకా మద్యం డబ్బు విషయాలు ఇంకా చెప్పనక్కర్లేదు. ఈ డబ్బు కో మద్యానికో లోబడి మీ ఓటు వినియోగాన్ని మీరు దుర్వినియోగం చేసుకుంటే మీ జీవితం ఇంకా అంతే.
కొంతమంది ఈ ఎన్నికల రోజుని సెలవు దినాలుగా పరిగణించి ఇంట్లోనే కూర్చొని టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి కొంతమంది ఎండలో వచ్చి లైన్లో నిలబడి ఓటు వేయాలా నేను ఒక్కడిని వెయ్యకపోతే ఏమవుతుంది అని ఇంట్లోనే ఉంటున్నారు.
మీరు బాగా ఆలోచించండి మీరు ఒక్కరోజు కష్టపడి నిలబడి సరైన అభ్యర్థికి ఓటు వేయడం వలన మన దేశ భవిష్యత్తు మీ తల్లిదండ్రుల పింఛన్ ,మీ చెల్లి తమ్ముళ్ల చదువు ,మీ పిల్లల భవిష్యత్తు ,మీ కుటుంబ ఆరోగ్యం , వెలిగే వీధిలైట్లు ,వికలాంగుల పింఛన్ ,తాగే నీరు, నిత్యవసరాలు ,ఉద్యోగాలు మీ భవిష్యత్తు మొత్తం మీ చేతి ఓటు లోనే ఉంది.
కనుక ఆలోచించి నీకు నచ్చిన సరేనా అభ్యర్థిని ఎంచుకొని సరైన అబ్యార్ధికి ఓటు వెస్తేనే. మనకోసం ఎన్నికలు ఏర్పాటు చేసిన మహాత్ములకు మనం ఇచ్చే గౌరవం.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in