Voter Survey:ఏలూరు,ఆగస్టు 13:సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితా తయారీలో భాగంగా ఇంటింటా ఓటర్ల సర్వే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యదర్శి వివేక్ యాదవ్ తెలిపారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఈఆర్ఓలతో మంగళవారం ఆయన అమరావతి నుంచి వీడియో సమావేశం నిర్వహించారు.
సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితా రూపొందించడానికి ఆగస్టు 20 నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు ఇంటింటా ఓటర్ల సర్వే ప్రక్రియ జరుగుతుందని ఎన్నికల ప్రధాన కార్యదర్శి చెప్పారు. అక్టోబర్ 19వ తేదీ నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తుల పరిశీలన జరుగుతుందన్నారు. అక్టోబర్ 29వ తేదీన సంక్షిప్త ముసాయిదా ఓటర్ల జాబితా రూపొందించాలన్నారు. సెప్టెంబర్ 29 నుంచి నవంబర్ 28వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామన్నారు. తదుపరి ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. డిసెంబర్ 24వ తేదీలోగా అభ్యంతరాలపై వచ్చిన దరఖాస్తుల పరిశీలన, పరిష్కార కార్యక్రమం చేపట్టాలన్నారు. 2025 జనవరి ఒకటో తేదీలోగా నిబంధనల మేరకు జాబితా సిద్ధమయ్యిందో లేదో పరిశీలించాలన్నారు. 2025 జనవరి ఆరో తేదీన సంక్షిప్త సవరణ ఓటర్ల తుది జాబితా ప్రచురించాలని ఆయన తెలిపారు. ఎన్నికల కమిషన్ సూచించిన మార్గదర్శకాలు పక్కాగా అమలు చేయాలన్నారు.
ఈ వీడియో సమావేశంలో జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి జిల్లా రెవిన్యూ అధికారి డి.పుష్ప మణి ,తదితరులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in