female weight loss dietfemale weight loss diet
0 0
Read Time:7 Minute, 7 Second

weight loss: బరువు తగ్గే ఆహారం

వేసవిలో త్వరగా బరువు తగ్గాలనుకుంటున్నారా?

వేసవిలో మనం ఎక్కువగా డిహైడ్రేట్ అవుతుంటాం దాని వలన ఎక్కువగా నీరు తాగాలనిపిస్తుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళు నీటితోపాటు లేదా నీటికి బదులుగా పండ్లను తీసుకోవాలి.


అన్ని రకాల పండ్లు ఆరోగ్యానికి మంచివే కానీ బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఎక్కువ ఫైబర్ తక్కువ క్యాలరీ ఉన్న పళ్ళను తీసుకుంటే మంచిది.


అంటే ఎక్కువ నీటి శాతం, ఎక్కువ ఫైబర్ మరియు తక్కువ క్యాలరీలు ఉన్న పండ్లను తీసుకుంటే బరువు తగ్గడం సులభం.

అయితే ఎక్కువ ఫైబర్ తక్కువ క్యాలరీలు ఉండి బరువు తగ్గించే కొన్ని రకాల పండ్లు ఉన్నాయి, వాటి గురించి తెలుసుకుందాం?

Healthy diet:

Fruit :

  1. పుచ్చకాయ
    పుచ్చకాయలు నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. మీ దాహాన్ని తీరుస్తుంది. వేసవి ఉష్ణోగ్రతల నుండి కాపాడుతుంది.ఇందులో క్యాలరీలు తక్కువే కానీ నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం తిన్న కడుపు నిండినట్టు ఉంటుంది. రోజులో కొంచెం తిన్న చాలు బరువు పెరగరు, పైగా డిహైడ్రేషన్ సమస్య కూడా ఉండదు.చెప్పుకోవాలి కానీ పుచ్చకాయలో పోషకాలు చాలానే ఉన్నాయి అన్ని రకాలుగా ఇది మన శరీరానికి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
  2. నారింజ
    నారింజలో విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా క్యాలరీలు తక్కువగా ఉంటాయి. నిమ్మ బత్తాయి నారింజ నువ్వుడు ఒకే జాతికి చెందినవి కానీ దీని నిమ్మ కన్నా ఉత్తమం అంటారు.నారింజ పీచు పదార్థం కాబట్టి జీర్ణ వ్యవస్థ కూడా బాగా పనిచేస్తుంది. నారింజ తినడంతో జీవక్రియ రేటు పెరుగుతుంది. బరువు తగ్గే అవకాశం కూడా లేకపోలేదు అలాగే కమలాలు కూడా తినవచ్చు.
  3. ఆపిల్
    ఆపిల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ గా ఉంటుంది.ఇది ఒకటి తిన్నా కడుపు నిండిపోతుంది కాబట్టి ఆకలి కూడా అదుపులో ఉంటుంది బరువు కూడా తగ్గవచ్చు. ఆపిల్ ని రోజు తీసుకోవడం వల్ల కొవ్వు తగ్గుతుంది. ఆపిల్ తినడం వల్ల శరీరంలో మరియు రక్తంలో కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది.ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిందేమిటంటే ఆహారం తీసుకునే అరగంట ముందు పండ్లు తినడం మంచిది.
  4. కర్బూజా
    కర్బూజా లో కార్బోహైడ్రేట్లు ,ప్రోటీన్లు, డైటరీ ఫైబర్, సోడియం ఇంకా రకరకాల పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.ఇందులో కొలెస్ట్రాల్ ఉండదు, ఈ పండులో నీటి శాతం కూడా ఎక్కువగా ఉంటుంది ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది కర్బూజా లో పొటాషియం ఉండటం వలన మన శరీరంలో కొవ్వు ను తగ్గిస్తుంది మరియు కడుపు నిండుగా ఉంచి ఆకలిని తీరుస్తుంది. ఇది కూడా హై ఫైబర్ కంటెంట్ ఉన్న పండు కర్పూజా తీయగానే ఉంటుంది కానీ క్యాలరీలు తక్కువే. ఇది మీ బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది,బరువు తగ్గుతాం కదా అని అతిగా తిన్నా ప్రమాదకరమే….
  5. బొప్పాయి
    హై ఫైబర్ కంటెంట్ ఉన్న పండు బొప్పాయిలో క్యాలరీలు కూడా తక్కువే దీనిని ఎక్కువగా తినడం వల్ల బరువు పెరిగే ప్రమాదం ఏమీ లేదు అలా అని మరీ అతిగా తినకూడదు. ఇది చెడు కొవ్వును తొలగిస్తుంది దీనిని తినడం వల్ల అలసట నీరసం కూడా తగ్గుతుంది నారింజ ఆపిల్ కంటే బొప్పాయిలో విటమిన్ ఇ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది తింటే జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి. బిపి షుగర్ ఉన్న వాళ్ళు కూడా బొప్పాయి తినవచ్చు.
  6. జామ
    జామకాయ హై ఫైబర్ కంటెంట్ గల పండు. దీనిలో కూడా క్యాలరీలు తక్కువే. జామకాయ లో పోషకాలు చాలా ఎక్కువ, దీనిలో ఉండే పీచు పదార్థం ఆకుకూరల్లో కంటే ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. జామకాయ తినడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది పైగా జీర్ణ సమస్యలు ఉండవు.
  7. దానిమ్మ
    బరువు తగ్గాలనుకునే వాళ్లకి దానిమ్మ చాలా సహాయపడుతుంది. దీనిలో క్యాలరీలు తక్కువే కానీ ఇతర పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి దానిమ్మ గింజలలో punic యాసిడ్ అనే పదార్థం కొవ్వును కరిగిస్తుంది. దీనిలోని పీచు పదార్థం జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి, ఎక్కువసేపు కడుపు నిండి ఉండేలా చేస్తుంది. దానిమ్మ గింజలు స్థూలకాయాన్ని నియంత్రించి కొవ్వును కరిగిస్తాయి.
  8. ద్రాక్ష:
    మిగతా పండ్లతో పోలిస్తే ద్రాక్షలో క్యాలరీలు చాలా తక్కువగా ఉండి ఫైబర్ అధికంగా ఉంటుంది. దీనిలో నీటి శాతం అధికంగా ఉంటుంది అందువలన కొంచెం తిన్న ఎక్కువ కడుపు నిండినట్టు అనిపించి ఆకలిని తగ్గిస్తుంది. ద్రాక్షాల్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి పచ్చ ద్రాక్ష మరొకటి నల్ల ద్రాక్ష. పచ్చ ద్రాక్ష కంటే నల్ల ద్రాక్ష తినడం మంచిది.ఎందుకంటే వాటి చర్మంలో రెస్వెరాట్రాల్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది బరువు తగ్గించడంలో చాలా సహాయపడుతుంది. పై తెలిపిన పండ్లు అన్నిటిని సాయంత్రపు భోజనానికి బదులుగా తీసుకుంటే సాధ్యమైనంతవరకు కూడా బరువు తగ్గుతారు.

లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *