WG ZP:ఏలూరు జిల్లా పరిషత్ క్యాంపు కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి పద్మశ్రీ ప్రసాద్ అధ్యక్షతన విద్య శాఖ పై జరిగిన సమీక్షా సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి అబ్రహం,
జడ్పీ సీఈఓ KSS సుబ్బారావు మరియు డిప్యూటీ సీఈఓ ఎస్ నిర్మల జ్యోతి పాల్గొన్న ఈ సమావేశంలో ఈ విద్య సంవత్సరంలో విద్యార్థులు అందరూ క్రమం తప్పకుండ పాఠశాలలకు నూటికి నూరు సెతం హాజరయ్యేలా చర్యలు తీసుకునే విధంగా ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఒక ప్రణాళిక ప్రకారం వెళ్లాలని, గడచిన విద్యా సంవత్సరంలో జిల్లా పరిషత్ ద్వారా పదవ తరగతి విద్యార్థులకి సులువుగా అర్ధవంతంగా తయారుజెయబడిన విజయకేతనం పుస్తక పఠనంతో వెనుకబడిన విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారని జడ్పీ చైర్మన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ పేర్కొన్నారు. అలాగే ఈ విద్యార్థులు సంవత్సరంలో బడి మానివేసిన వారిని తిరిగి పాఠశాలలో పునఃప్రవేశం చేసేవిధంగా ఉపాధ్యాయులు, ఉద్యోగులు అందరూ వారి తల్లిదండ్రులకు నచ్చచెప్పి చదువు యొక్క గొప్పతనాన్ని తెలిపి విద్యార్థులను పాఠశాలకు వచ్చేలా ప్రోత్సహించాలని తెలిపారు.
జిల్లాలోని అన్ని పాఠశాలలో మధ్యాహ్నం భోజన పధకంలో రోజు వారి మెనూ ప్రకారం మధ్యాహ్నం భోజనాన్ని సక్రమంగా అందించాలన్నారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రతి విద్యార్థికి వారి వారి పాఠశాలల ద్వారా పాఠ్యపుస్తకలు అందినవా లేదా అనేది సరిచూచి పాఠ్యపుస్తకాలు కొరత లేకుండా చూడాలని తెలిపారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in