World Womens Day ఏలూరు,మార్చి,8: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా సర్. సిఆర్ రెడ్డి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాల్స్ ఆకట్టుకున్నాయి. ఈ స్టాల్స్ ను శనివారం జిల్లా ఇన్ చార్జీ మంత్రి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, జెడ్పి చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాదరావు, ఏలూరు శాసన సభ్యులు బడేటి రాధాకృష్ణయ్య(చంటి), నగర మేయర్ నూర్జాహాన్ పెదబాబు, ఆర్ టి సి రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి తదితరులు సందర్శించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన పౌష్టిక ఆహార స్టాల్ మరింత ఆకట్టుకుంది. వివిధ స్వయం సహాయ సంఘాలు తయారుచేసిన వివిధ ఆహార ఉత్పత్తులు, జ్యూట్ బ్యాగులు తదితర స్టాల్స్ ఏర్పాటు చేశారు. వీటితోపాటు వ్యవసాయశాఖ, ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో కూడా స్టాల్స్ ఏర్పాటు చేశారు. మహిళల రక్షణ కొరకు మహిళా పోలీస్ సిబ్బందితో ఏర్పాటు చేసిన అభయ మహిళా రక్ష స్టాల్ ను కూడా ఏర్పాటు చేశారు.

రూ. 131.82 కోట్ల రుణాల పంపిణీ..
డిఆర్డిఏ ఆధ్వర్యంలో బ్యాంక్ లింకేజి కింద మహిళా సంఘాలకు రూ.106.12 కోట్లు, పిఎంఎజెఎవై పధకం కింద రూ. 1.53 కోట్లు, పిఎంఎఫ్ఎంఎఫ్-పిఎంఇజిపి కింద రూ. 1.49 కోట్లు, మెప్మా ఆధ్వర్యంలో 181 మహిళా సంఘాలకు రూ. 17.43 కోట్లు, ప్రేరణాశక్తి కార్యక్రమం కింద నలుగురు ఉత్తమ వ్యాపారవేత్తలకు రెండు లక్షల రూపాయల చెక్కు, మెప్మా ఆధ్వర్యంలో నూతనంగా వ్యాపారం ప్రారంభించుకున్న350 మహిళలకు రూ. 5.25 కోట్లు, అందజేశారు. అదే విధంగా మహిళలకు ప్రత్యేకించి బి.సి. కార్పోరేషన్ ఆధ్వర్యంలో టైలరింగ్ నందు ఉచిత శిక్షణతోపాటు జీవనోపాధికొరకు 4589 మంది మహిళలకు రూ. 11.47 కోట్లు విలువైన కుట్టుమిషన్లు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in