Zinc Deficiency:ఈ సంకేతాలన్నీ జింకు లోపమే గర్భిణీల్లో బిడ్డ ఎదుగుదలకు జింక్ తప్పనిసరి. ప్రసవానికి ముందు వయసు ఎత్తుకు తగ్గినట్లు బరువు ఉండాలి.
అలా ఉండకపోయినా అకస్మాత్తుగా బరువు తగ్గిన ఉండాల్సిన దాని కన్నా బిడ్డ ఎదుగుదలు తక్కువగా ఉన్న జింక్ లోపం కావచ్చు.
కాబట్టి వారికి రోజు ఆహారం ద్వారా 11 మిల్లీగ్రాముల జింక్ అందేలా చూడాలి. ప్రసవం తరువాత తల్లి పాలు సమృద్ధిగా ఉత్పత్తి కావాలన్న రోజుకు కనీసం 12 మిల్లీగ్రాముల జింక్ అవసరం అవుతుంది. పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకుంటేనే శరీరానికి కావలసిన జింక్ ను అది తయారు చేసుకోగలుగుతుంది.
మహిళలు తొందరగా బరువు తగ్గించుకునే ప్రక్రియలో జింక్ స్థాయిలు పడిపోతుంటాయి. దీంతో మొత్తం ఆరోగ్యం పైన చెడు ప్రభావం పడగలదు. కాబట్టి వైద్యుల సూచనలు మేరకు ప్రయత్నించడం మంచిది.
శిరోజాలపై
శరీరానికి విటమిన్లు, ఖనిజ లవణాలు కావలసిన స్థాయిలు అందకపోతే జీవక్రియలు సక్రమంగా జరగవు. ఈ ప్రభావం ప్రతి అవయవం పైన పడుతుంది. వ్యాధి నిరోధక శక్తి తన విభజన కొత్త కణాలు ఉత్పత్తి వంటి పలు రకాల క్రియల్లో జింక్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. శరీరం దీనిని నిల్వ ఉంచుకోదు. ఎప్పటికప్పుడు తీసుకునే ఆహారం ద్వారానే అందుతుంది. మహిళల్లో ఎక్కువగా కనిపించే జుట్టు రాలే సమస్య అకస్మాత్తుగా పెరిగితే అది జింక్ లోపమే కావచ్చు. అలాగే తరచూ జలుబు, చిన్న దెబ్బ కూడా త్వరగా తగ్గకపోవడం వంటివన్నీ దీనికి సంకేతకాలు. వైద్యున్ని సంప్రదించి తగిన సప్లమెంటరీ తో పాటు పోషక విలువలు ఉండే ఆహారాన్ని పెద్ద పీట వేస్తే మంచిది.
మెనోపాజ్ లో
ఎంతో గుర్తుగా పెట్టుకునే వస్తువు మరుసటి రోజు మర్చిపోవడం, పనిపై శ్రద్ధ తగ్గడం ఏ పనిలోని ఆసక్తి లేకపోవడం వంటి వాటికి చాలా సార్లు జింక్ లోపమే కారణం. ఇది బ్రెయిన్ ఫాగ్ కు దారితీస్తుంది. కొన్నిసార్లు జ్ఞాపకశక్తి కూడా సన్నగిల్లుతుంది. ఆహారంలో బాదం, వెల్లుల్లి, పచ్చి బఠానీలు, గింజలు, గింజ ధాన్యాలు, పుట్టగొడుగులు, గుడ్లు, రొయ్యలు, చేప, మాంసం, పాలు వాటన్నిటిని ఆహారంలో తీసుకుంటే ఈ సమస్య కు చెక్ పెట్టొచ్చు. ఉత్సాహం, చురు
కుదనం తిరిగి పొందొచ్చు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in